Rs 500 subsidy Cylinder: తెలంగాణలో రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకానికి ఎంపికయ్యారో లేదో ఇలా తెలుసుకోండి!

How to check if gas cylinder subsidy is being deposited in Account in Telangana
  • www.mylpg.in సైట్ లో లబ్ధిదారుల సబ్సిడీ వివరాలు
  • లబ్ధదారుల అకౌంట్‌లో సబ్సిడీ జమ అయిన చరిత్ర వెబ్‌సైట్‌లో నిక్షిప్తం
  • సబ్సిడీ కనిపించని పక్షంలో 1800233355 నెంబర్‌పై ఫిర్యాదు చేసే అవకావం
తెలంగాణ ప్రభుత్వం ‘రూ.500లకే గ్యాస్ సిలిండర్’ పథకం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత సబ్సిడీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. అయితే, సబ్సిడీ తమకు అందుతోందో లేదో ఎలా తెలుసుకోవాలనే సందేహం అనేక మందిలో ఉంది. 

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల్లో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిలిండర్ డెలివరీ టైంలో ధర మొత్తాన్ని తీసుకున్నా సిలిండర్ సబ్సిడీ ధర పోను మిగతా మొత్తాన్ని అర్హులకు అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే, తమకు సబ్సిడీ వచ్చిందీ లేనిదీ ఎలా తెలుసుకోవాలో అర్థంకాక అనేక మంది రకరకాల సందేహాలతో ఇబ్బందులు పడుతున్నారు. 

అయితే, సబ్సిడీ డబ్బు అందిందీ లేనిదీ తెలుసుకునేందుకు ముందుగా www.mylpg.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ ఆప్షన్ ను ఎంచుకుని లాగిన్ కావాలి. అకౌంట్ పేజీలోకి వెళ్లాక పేజీ పైభాగాన ఉన్న లబ్ధిదారుడి ఫొటో కనిపిస్తుంది. ఆ తరువాత లబ్ధిదారులు తమ సిలిండిర్ ఏ కంపెనీదో తెలుసుకుని క్లిక్ చేసి ఎంచుకోవాలి. ఆ తరువాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ పై క్లిక్ చేస్తే మీ సిలిండర్ కి సబ్సిడీ చరిత్ర మొత్తం అక్కడ కనిపిస్తుంది. ఇది కనిపించని పక్షంలో 1800233355 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
Rs 500 subsidy Cylinder
Telangana
Revanth Reddy
Congress

More Telugu News