Cristiano Ronaldo: మైదానంలో వెక్కివెక్కి ఏడ్చిన సాకర్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో.. వీడియో వైర‌ల్‌!

Cristiano Ronaldo Spotted Crying After Al Hilal Defeated Al Nassr in King Cup of Champions 2024
  • కింగ్ క‌ప్ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అల్-హిలాల్ చేతిలో అల్-న‌సార్ ఓట‌మి
  • తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జట్టు ప‌రాజయంతో కన్నీటిపర్యంతమైన రొనాల్డో
  • మైదానంలో సాకర్‌ లెజెండ్ వెక్కివెక్కి ఏడ్చిన వీడియో నెట్టింట వైర‌ల్‌
కింగ్ క‌ప్ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సాకర్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ అల్-న‌సార్ జ‌ట్టు అల్-హిలాల్ చేతిలో ఓడిపోయింది. దీంతో రొనాల్డో మైదానంలో వెక్కివెక్కి ఏడ్చాడు. ఇలా ఫుట్‌బాల్ దిగ్గ‌జం కన్నీటిపర్యంతమైన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.  

సౌదీ ప్రో లీగ్ సీజ‌న్ 2023-24లో ట్రోఫీ  గెలిచేందుకు రొనాల్డో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన‌ప్పటికీ, అల్-న‌సార్ జట్టుకు ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. దీంతో పోర్చుగ‌ల్‌ సాక‌ర్ లెజెండ్ ఓట‌మిని త‌ట్టుకోలేక‌ మైదానంలోనే బోరున ఏడ్చాడు. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో రొనాల్డో త‌న‌ జ‌ట్టు త‌ర‌ఫున ఒక గోల్ కూడా కొట్టాడు. అయినా త‌న జ‌ట్టును ఓట‌మి నుంచి త‌ప్పించ‌లేక‌పోయాడు. దీంతో ఈ సీజ‌న్‌లో అల్-న‌సార్ జట్టు ట్రోఫీ గెల‌వ‌లేక ఒట్టి చేతుల‌తోనే ఇంటిముఖం ప‌ట్టింది. 

ఇక‌ 39 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ ఆట‌ప‌ట్ల ఎంత ని‌బ‌ద్ధ‌త‌తో ఉంటాడో తెలిసిందే. అందుకే త‌న జ‌ట్టు ఓట‌మిని జీర్ణించుకోలేక ఇలా వెక్కివెక్కి ఏడ్చాడు. దీని తాలూకు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన సాక‌ర్‌, రొనాల్డో అభిమానులు అయ్యో పాపం అంటున్నారు.
Cristiano Ronaldo
Al Hilal
Al Nassr
King Cup of Champions 2024

More Telugu News