TTDP: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ

Chandrababu Says TDP Will Contest In Telangana Local Body Polls
  • అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ
  • ఎందుకలా ఉండాల్సి వచ్చిందో వివరించిన చంద్రబాబు
  • త్వరలోనే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న అధినేత
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో యువతను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిని నియమిస్తామని తెలిపారు.

తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి పార్టీ దూరంగా ఎందుకు ఉందో, అందుకు దారితీసిన పరిస్థితులు ఏవో వారికి వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని తెలిపారు. ఏపీలో పరిణామాల కారణంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించలేకపోయానని, ఇకపై సమయం కేటాయిస్తానని చంద్రబాబు వారికి తెలిపారు.
TTDP
Telangana
Chandrababu
Local Body Polls

More Telugu News