Prajwal Revanna: అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల సిట్ కస్టడీ

Revanna Sent To Police Custody Till June 6
  • 14 రోజుల కస్టడీని కోరిన న్యాయస్థానం
  • రేపటి నుంచి ఆరు రోజుల పాటు విచారించనున్న పోలీసులు
  • రేవణ్ణ ఫోన్, డేటా రికవరీ చేయనున్న పోలీసులు
అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది. ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి ఆరు రోజులు ఆయనను సిట్ పోలీసులు విచారిస్తారు. రేవణ్ణను మిస్సింగ్ మొబైల్ ఫోన్ విషయమై ఆరా తీయనున్నారు. ఫోన్, డేటా రికవరీ చేయాల్సి ఉంది.

ప్రజ్వల్ రేవణ్ణను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. నెల రోజులకు పైగా విదేశాల్లో తలదాచుకున్న రేవణ్ణ బెంగళూరు రాగానే ఐదుగురు మహిళా పోలీసులు అతనిని అరెస్ట్ చేసి హెడ్‌మూరికట్టిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
Prajwal Revanna
Karnataka
SIT

More Telugu News