Revanth Reddy: కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు... ఆహ్వాన లేఖతో పాటు రేవంత్ రెడ్డి రాసిన లేఖ అందజేత

Government invites KCR to Telangana Formation Day celebrations
  • కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అర్విందర్ సింగ్
  • ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని... అందుకే ఆహ్వానించామని వెల్లడి
  • ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అర్విందర్ సింగ్ వెళ్లారు. ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ నివాసం బయట వారు మీడియాతో మాట్లాడుతూ... ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించినట్లు చెప్పారు.

ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని... అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో... ఉద్యమనేతగా ఆయనను ఆహ్వానించామన్నారు. ఈ వేడుకలలో కేసీఆర్ భాగస్వాములు అవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, విపక్షనేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Revanth Reddy
KCR
Telangana Formation Day

More Telugu News