DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై కేరళ మంత్రి బిందు స్పందన

Kerala minister Dr R Bindu responds to DK Shivakumar allegations
  • తనపైనా, సీఎం సిద్ధరామయ్యపైనా చేతబడి జరుగుతోందన్న డీకే శివకుమార్
  • కలకలం రేపిన డీకే వ్యాఖ్యలు
  • కేరళలో అలాంటి వాటికి చోటు లేదన్న డాక్టర్ ఆర్.బిందు
తనపైనా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైనా కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో చేతబడి చేశారంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తమకు వ్యతిరేకంగా పలువురు రాజకీయ నేతలు 'శత్రుభైరవి యాగం' చేయించారని డీకే శివకుమార్ ఆరోపించారు. 

దీనిపై కేరళ మంత్రి డాక్టర్ ఆర్.బిందు స్పందించారు. దేశంలో ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి మూఢాచారాలు కొనసాగుతున్నప్పటికీ, కేరళలో ఇలాంటివి జరగవని, తమ రాష్ట్రంలో అటువంటి కార్యకలాపాలకు చోటు లేదని బిందు స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఒకవేళ కేరళలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయేమో పరిశీలిస్తామని అన్నారు.
DK Shivakumar
Black Magic
Dr R Bindu
Kerala
Karnataka

More Telugu News