ప్రైవేటు స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్స్, షూస్, బెల్టులు అమ్మవద్దు: హైదరాబాద్ డీఈవో కీలక ఆదేశాలు
- హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు ఆదేశాలు వర్తింపు
- ప్రైవేటు పాఠశాలల నిరంతర పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
- కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్‌లో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలన్న డీఈవో
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల కౌంటర్‌లో విక్రయాలు ఉంటే లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు. అందుకే స్కూళ్లలో ఎలాంటి విక్రయాలు ఉండరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉల్లంఘనలు జరిపితే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.