Virat Kohli: టీ20 వరల్డ్ కప్.. అమెరికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ

Virat Kohli leaves for the USA gives autograph to fan at Mumbai Airport
  • గురువారం ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విరాట్ కోహ్లీ
  • ఎయిర్‌పోర్టులో ఆయనను చుట్టుముట్టిన అభిమానులు
  • ఓ చిన్నారి అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ 
త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు కింగ్ కోహ్లీ నిన్న అమెరికాకు బయలుదేరారు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టి ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఓ చిన్నారికి కోహ్లీ ఆటోగ్రాఫ్ కుడా ఇచ్చారు. అంతకుముందు, కోహ్లీ దంపతులు తమ పిల్లల ప్రైవసీ విషయంలో సహకరించినందుకు విలేకరులకు బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే, ఈ ఐడియా తనది కాదని, అనుష్కది అని కోహ్లీ చెప్పాడు. 

అయితే, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో కూడిన టీమిండియా తొలి బ్యాచ్ జూన్ 25నే అమెరికాకు వెళ్లింది. పేపర్ వర్క్ సమస్యల కారణంగా కోహ్లీ వారితో కలిసి వెళ్లలేకపోయాడు.  
Virat Kohli
T20 World Cup 2024
USA
Team India
Viral Videos

More Telugu News