Raja Singh: నాకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

Raja Singh says he gave CM Revanth Reddy number to threat callers
  • తనకు ఫోన్ చేసి బెదిరించిన వాళ్లు తన వద్ద ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగారని వెల్లడి
  • ఇంకో నెంబర్ ఉందని చెప్పి ముఖ్యమంత్రిది ఇచ్చానన్న రాజాసింగ్
  • సీఎంకు బెదిరింపు కాల్స్ వెళితే ఆయన చర్యలు తీసుకుంటారనే నెంబర్ ఇచ్చినట్లు వెల్లడి
తనకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు. ముఖ్యమంత్రి నెంబర్ ఇవ్వడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళితే... బెదిరింపులకు పాల్పడిన వారిపై ఆయన చర్యలు తీసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ నెంబర్ ఇచ్చానన్నారు.

తనకు ఫోన్ చేసి బెదిరించినవాళ్లు తన వద్ద ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగారని... అప్పుడే తాను ఇంకో నెంబర్ ఉందని చెప్పి ముఖ్యమంత్రిది ఇచ్చినట్లు చెప్పారు.  ధర్మం కోసం పని చేస్తే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు.
Raja Singh
Revanth Reddy
Congress
BJP

More Telugu News