NTR: ఎన్టీ రామారావు చిన్నప్పటి ఫొటో పంచుకున్న పట్టాభి

TDP leader Pattabhi shares a rare photograph of NTR on his birth anniversary
  • నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
  • ఆయన జన్మించడం తెలుగువాడి అదృష్టం అంటూ పట్టాభి ట్వీట్
  • నందమూరి తారక రాముడికి నివాళులు తెలుపుకుంటున్నట్టు వెల్లడి
తెలుగుజాతి స్ఫూర్తి ప్రదాత, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియని ఎన్టీ రామారావు చిన్నప్పటి ఫొటోను పట్టాభి ట్వీట్ చేశారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ను ఆ ఫొటోలో చూడొచ్చు. 

"ఆయన జన్మించడం తెలుగువాడి అదృష్టం... ఆయన నటించడం సినీ తెరకే మహాభాగ్యం... ఆయన రాజకీయం పెను సంచలనం... ఆయన ఆహార్యమే తెలుగువాడి ఆత్మాభిమానం... అనితర సాధ్యుడు, అనన్య సామాన్యుడు, యుగపురుషుడు నందమూరి తారక రాముడు చిరస్మరణీయుడు... ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు" అంటూ పట్టాభి పేర్కొన్నారు.
NTR
Birth Anniversary
Pattabhi
TDP
Andhra Pradesh

More Telugu News