Tamilnadu: ఆలయ నిర్మాణానికి మసీదు స్థలం విరాళంగా ఇచ్చిన ముస్లింలు!

Tamil Nadu Muslims donate land for Hindu temple construction
  • తమిళనాడు తిరుప్పూరు జిల్లాలోని రోస్ గార్డెన్ ప్రాంతంలో ఘటన
  • స్థానికంగా మసీదు మాత్రమే ఉన్న వైనం
  • స్థలం లేక ఆలయ నిర్మాణం చేపట్టని హిందువులు
  • మసీదు స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించిన ముస్లింలు
తమిళనాడు తిరుప్పూరు జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఆలయ నిర్మాణానికి స్థలం లేకపోవడంతో స్థానిక ముస్లింలు మసీదు స్థలాన్ని దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. జిల్లాలోని ఒట్టపాళెయం రోస్ గార్డెన్ ప్రాంతంలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.  

ఇక్కడ మసీదు ఉన్నప్పటికీ హిందువులకు ఆలయం లేదు. గుడి కట్టాలనుకున్నా స్థలం లేకపోవడంతో ఆ వర్గం వారు మౌనంగానే ఉండిపోయారు. ఇది తెలిసిన ఆ ప్రాంత ముస్లింలు స్థానిక మసీదుకు చెందిన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం గుడి పనులు పూర్తయి సోమవారం కుంభాభిషేకం జరిగింది. సారెతో కార్యక్రమానికి వచ్చిన ముస్లింలకు హిందువులు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Tamilnadu
Land Donation
masjid Land
Temple Construction

More Telugu News