Dogs Attack: చుట్టుముట్టి దాడిచేసిన కుక్కలు.. మృతి చెందిన రైతు

Farmer Killed In Dogs Attack In Parvathipuram Manyam District
  • పార్వతీపురం మన్యం జిల్లా బిత్రపాడులో ఘటన
  • ఐదారు కుక్కలు చుట్టుముట్టి దాడి
  • తప్పించుకోలేకపోయిన రైతు శంకరరావు
  • తొడలు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలతో మృతి
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకరరావు (40) నిన్న ఉదయం గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదారు కుక్కలు ఆయనను చూసి మీదికి ఎగబడి దాడిచేశాయి. కుక్కలన్నీ ఒకేసారి దాడిచేయడంతో శంకరరావు తప్పించుకోలేకపోయాడు. 

వాటి దాడిలో తొడలు, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. శంకరరావు అరుపులకు అక్కడికి చేరుకున్న స్థానికులు కుక్కలను తరిమి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే చినమేరంగి సీహెచ్‌సీకి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dogs Attack
Farmer
Parvathipuram Manyam District
Jiyyammavalasa

More Telugu News