Battle Tank Championship: రష్యాలో ఆర్మీ యుద్ధ ట్యాంకుల రేసు... దూసుకుపోయిన భారత యుద్ధ ట్యాంకు
- రష్యాలో మిలిటరీ గేమ్స్
- యుద్ధ ట్యాంకుల చాంపియన్ షిప్ లో నెంబర్ వన్ గా భారత్
- 50 టన్నుల యుద్ధ ట్యాంకును పరుగులు తీయించిన మన్ దీప్ సింగ్
అంతర్జాతీయ వేదికపై భారత సైనిక పాటవం మరోసారి నిరూపితమైంది. రష్యాలో జరిగిన మిలిటరీ గేమ్స్ లో భారత్ యుద్ధ ట్యాంకుల రేసులో విజేతగా నిలిచింది. యుద్ధ ట్యాంకుల చాంపియన్ షిప్ లో భాగంగా కఠినమైన విభిన్న ఉపరితలాలపై రేసు నిర్వహించగా... భారత ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్ దీప్ సింగ్ తన యుద్ధ ట్యాంకును పరుగులు తీయించాడు.
50 టన్నుల బరువున్న ట్యాంకును ఎంతో ఒడుపుగా నడిపి ప్రథమస్థానంతో విజేతగా నిలిచాడు. ఇతర దేశాల యుద్ధ ట్యాంకులు భారత యుద్ధ ట్యాంకుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

►రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్షిప్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) May 27, 2024
►ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్దీప్సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. pic.twitter.com/9krHdcsAHp