CM Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Accused in stone attack on CM Jagan bail petition verdict reserved
  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై రాయితో దాడి
  • సతీశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సతీశ్ బెయిల్ పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ
మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నేడు విచారణ చేపట్టింది. 

పోలీసులు సతీశ్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరఫు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
CM Jagan
Stone Attack On Jagan
Sateesh
Bail plea
YSRCP
Andhra Pradesh

More Telugu News