Mamata Banerjee: ఐపీఎల్-2024 విజేతగా కోల్‌కతా నిలవడంపై సీఎం మమతా బెనర్జీ స్పందన

Kolkata Knight Riders win has brought about an air of celebration all across Bengal says Mamata Banerjee
  • కోల్‌కతా విజయం బెంగాల్ అంతటా అంబరాన్ని తాకే సంబరాలు తెచ్చిందన్న ముఖ్యమంత్రి
  • ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రతిఒక్కరికి వ్యక్తిగత అభినందనలు తెలిపిన మమతాబెనర్జీ
  • రానున్న సంవత్సరాల్లో కూడా కోల్‌కతా అద్బుత విజయాలు సాధించాలని ఆకాంక్షించిన సీఎం
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2024 ట్రోఫీని గెలవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంతటా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. ఐపీఎల్-2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలవడంపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ సాధించిన విజయం బెంగాల్ అంతటా అంబరాన్ని తాకే సంబరాలు తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ.. ప్రతిఒక్కరికి నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలషిస్తున్నాను’’ అంటూ ఆమె పేర్కొన్నారు.
Mamata Banerjee
Kolkata Knight Riders
IPL 2024
Cricket
West Bengal

More Telugu News