మలేసియా మాస్టర్స్ టోర్నీ టైటిల్ కు అడుగు దూరంలో పీవీ సింధు
- కౌలాలంపూర్ వేదికగా మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
- నేడు సెమీఫైనల్లో థాయ్ లాండ్ అమ్మాయి బుసానన్ ను ఓడించిన సింధు
- రేపు ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో అమీతుమీ
మూడు గేముల పాటు సాగిన ఈ పోరులో సింధు 13-21, 21-16, 21-12 తేడాతో నెగ్గింది. తొలి గేమును ప్రత్యర్థికి చేజార్చుకున్న సింధు... ఆ తర్వాత వరుసగా రెండు గేములు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ దాదాపు 88 నిమిషాల పాటు సాగింది.
ఆదివారం నాడు జరిగే ఫైనల్లో సింధు చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో తలపడనుంది.