కొనసాగుతున్న ఆరవ దశ పోలింగ్.. ఓటేసిన రాష్ట్రపతి, పలువురు ప్రముఖులు
- ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలింగ్
- ఉదయం 9 గంటలకు సగటున 10 శాతం పోలింగ్ నమోదు
- ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు
కాగా, ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావ్ ఇందర్‌జిత్ సింగ్, మంత్రి జైశంకర్ బీజేపీ నేత మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్, మనోజ్ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్, మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతం గంభీర్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.