Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్... చెరువులో నిర్మించారంటూ ప్రహరీగోడ కూల్చివేత

Shock to Minister Mallareddy over wall building in ftl
  • పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు
  • జేసీబీతో ప్రహరీగోడను కూల్చివేయించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
  • పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాల కూల్చివేత
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. శామీర్‌పేట మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం నాడు జేసీబీలతో ప్రహరీగోడను కూల్చివేశారు.

ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేతలు చేపట్టారు. ఇదే పెద్దచెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. గత కొన్నిరోజులుగా మల్లారెడ్డికి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్‌లను అక్రమ నిర్మాణాలు అంటూ అధికారులు కూల్చి వేస్తున్నారు.
Ch Malla Reddy
Telangana
BRS
Congress

More Telugu News