Tea seller: ‘టీ’ విక్రేతకు రూ.49 కోట్ల ఆదాయ పన్ను నోటీసులు

tea seller has been served a notice worth Rs 49 crore by the Income Tax department
  • గుజరాత్‌లోని పటాన్‌లో షాకింగ్ ఘటన
  • నోటీసు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ
  • బ్రోకరేజ్‌ వ్యాపారులు తన పాన్‌ కార్డుని దుర్వినియోగం చేశారంటున్న బాధితుడు
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నవగంజ్ కమొడిటీ మార్కెట్‌లో టీ విక్రయించే ఖేమ్‌రాజ్ దేవ్ అనే వ్యక్తికి ఆదాయ పన్నుశాఖ ఏకంగా రూ.49 కోట్ల ఐటీ నోటీసులు జారీ చేసింది. దీంతో అతడు కంగుతిన్నాడు. అయితే కాస్త తేరుకున్న దేవ్ గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు గుర్తించాడు. తాను టీ విక్రయిస్తున్న మార్కెట్‌ పరిధిలోనే బ్రోకరేజ్‌ వ్యాపారం చేస్తున్న అల్పేశ్, విపుల్‌ పటేల్‌ ఇద్దరూ తన పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించారని దేవ్ చెబుతున్నాడు. కొన్నేళ్ల క్రితం వారిరువురితో తనకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ తన టీ షాపుకి వచ్చి టీ తాగి వెళ్లేవారని చెప్పాడు. 

7వ తరగతి వరకే చదువుకున్న దేవ్ 2014లో తన బ్యాంక్ ఖాతాను పాన్ కార్డ్‌తో లింక్ చేసుకునేందుకు సాయం చేయాలంటూ అల్పేశ్, విపుల్‌ సోదరులను అడిగాడు. వారు కోరడంతో ఆధార్, పాన్ కార్డుతోపాటు ఒక ఫొటో కూడా ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్, పాన్ కార్డులను దేవ్‌కి తిరిగి ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని పేపర్లపై కూడా సంతకాలు చేశానని దేవ్ చెబుతున్నాడు. వారిద్దరే తనని మోసం చేశారని దేవ్ చెప్పాడు.

కాగా ఆర్థిక సంవత్సరం 2015, 2016 సంవత్సరాల్లో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. కాగా గతేడాది ఆగస్టులో దేవ్‌కి తొలిసారి ఐటీ నోటీసులు వచ్చాయి. అయితే తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసులను పట్టించుకోలేదు. తిరిగి రెండోసారి నోటీసులు రావడంతో మ్యాటర్ సీరియస్ అని దేవ్ గుర్తించాడు. సురేశ్ జోషి అనే న్యాయవాదిని సంప్రదించడంతో అసలు విషయం దేవ్‌కు అర్థమైంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో తన పాన్‌కార్డుపై అక్రమ లావాదేవీలు నిర్వహించడంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు అతడు గుర్తించాడు.

తన బ్యాంక్ ఖాతాను దేవ్ పూర్తిగా తనిఖీ చేసి లావాదేవీలు ఏమీ జరగలేదని చెప్పాడు. కానీ అతడి పేరు మీద మరో అకౌంట్ ఉందని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. అవగాహన ఉన్న పలువురి సూచన మేరకు దేవ్ న్యాయవాదిని సంప్రదించాడు. అయితే విషయం ఎవరికీ చెప్పొద్దంటూ నిందితులు అల్పేశ, విపుల్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ములు ఇద్దరిపై ఫోర్జరీ, మోసం కేసు పెట్టాడు.
Tea seller
Income Tax department
IT Notices
Gujarat

More Telugu News