Jogi Ramesh: వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలి: మంత్రి జోగి రమేశ్ పిలుపు

Minister Jogi Ramesh calls YCP cadre for winning celebrations
  • ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు విధ్వంసాలు సృష్టిస్తున్నారన్న జోగి
  • రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా
  • చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేశ్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా చేశారు. 

ఇక, పురందేశ్వరి ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం అందించారని, అందువల్లే అధికారులను మార్చారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. అధికారులను మార్చిన చోటే గొడవలు జరిగాయని అన్నారు. టీడీపీ ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు పల్నాడులో అల్లర్లకు తెరలేపారని ఆరోపించారు.
Jogi Ramesh
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News