Jr NTR: రాజమౌళి మహాభారతంలో ద్రౌపదిగా ఎవరుండాలంటే.. ఎన్టీఆర్ చాయిస్ ఆమేనట!

Who Is NTR Chance To Play Draupadi Roll In Rajamouli Mahabharata
  • జూనియర్ బర్త్ డే సందర్భంగా పాత ఇంటర్వ్యూ వైరల్
  • మహాభారతంలో పాత్రల ఎంపికపై సరదా సంభాషణ
  • చెప్తే రాజమౌళి చంపేస్తాడు కాబట్టి చెప్పనన్న తారక్

తెలుగు చిత్రసీమలోని అగ్రనటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నిన్న తన 41వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఓ పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అది.

మహాభారతాన్ని తెరపై ఆవిష్కరించాలన్నది తన కల అని రాజమౌళి పలుమార్లు ప్రకటించారు. అయితే, అంతకంటే ముందు దేశంలో అందుబాటులో ఉన్న మహాభారతంలోని అన్ని వెర్షన్లు చదివేందుకే తనకు ఏడాది పడుతుందని, మహాభారతాన్ని సినిమాగా తీస్తే అది పది భాగాలుగా ఉంటుందని చెప్పాడు.

‘బాలీవుడ్ హంగామా చాట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మహాభారతంపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. మహాభారతంలో పాత్రల ఎంపికపై ఫిల్మ్‌‌మేకర్ మీ సలహా కోరితే ఏమంటారన్న ప్రశ్నకు తారక్ స్పందిస్తూ.. చెప్తే రాజమౌళి చంపేస్తాడు కాబట్టి చెప్పకూడదని అనుకుంటున్నట్టు నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ వదలని ఇంటర్వ్యూయర్ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడి పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు.. జూనియర్ తెలివిగా తన పేరు చెప్పి తప్పించుకున్నాడు. అయితే, ద్రౌపదిగా ఎవరిని ఎంచుకుంటారంటే మాత్రం కొంచెం తబడుతూనే ‘అలియాభట్’ అని చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్న గదిలోకి మిమ్మల్ని తోసి గడియ పెడితే ఏం మాట్లాడతారన్న మరో ప్రశ్నకు బదులిస్తూ.. అది పూర్తిగా వ్యక్తిగతమని, కాబట్టి సమాధానం చెప్పకూడదనుకుంటున్నానంటూ మరోమారు నవ్వులు పూయించాడు.

  • Loading...

More Telugu News