TG 09 9999: ఫ్యాన్సీ నంబర్ టీజీ 09 9999.. పలికెన్ రూ.25.50 లక్షలు!

Fancy Vehicle Number TG 09 9999 sold for over Rs25 Lakhs huge ammount
  • వేలంలో భారీ ధరకు దక్కించుకున్న సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్
  • ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో కొత్త సిరీస్ ప్రారంభం
  • ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం
వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో  టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది. తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్‌ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి.

కాగా ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబర్‌తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43,70,284 రాబడి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
TG 09 9999
TS RTA
Telangana
Khairatabad RTA

More Telugu News