Chiranjeevi: తారక్ కూడా అలాంటి నిత్యకృషీవలుడే: చిరంజీవి

Chiranjeevi wishes Tarak on his birthday
  • ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
  • ఘనంగా ఎన్టీఆర్ 41వ జన్మదిన వేడుకలు
  • ఆసక్తికర ట్వీట్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ (మే 20) తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "కలలు అందరికీ ఉంటాయి. అవి నిజం చేసుకునేందుకు కొందరు కృషి చేస్తారు. కళారంగంలో అలాంటి నిత్యకృషీవలుడు తారక్ కు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Tarak
Jr NTR
Birthday
Wishes

More Telugu News