Junior NTR: అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్

Junior NTR special tweet for fans
  • ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
  • బర్త్ డే సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • అసామాన్యమైన మీ ప్రేమకు ధన్యుడినన్న తారక్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర ప్రముఖులు గ్రీటింగ్స్ తెలిపారు. ఫ్యాన్స్ సంబరాలకైతే అంతేలేకుండా పోయింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా తారక్ స్పెషల్ పోస్ట్ పెట్టారు. 

'ప్రియమైన అభిమానులారా... నా ప్రయాణం మొదలైన తొలి రోజు నుంచి మీరు నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్స్. అసామాన్యమైన మీ ప్రేమకు ధన్యుడిని. 'దేవర' పాటకు మీ నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు అందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. 

Junior NTR
Tollywood
Birthday

More Telugu News