Bengaluru: గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్.. ఆటకట్టించిన పోలీసులు

Road isnt a stage for stunts Man rides bike with a woman on his lap booked after viral video
  • వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు
  • యువకుడిని అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్న వైనం
  • రోడ్లు ఉన్నది స్టంట్లు చేసేందుకు కాదంటూ కామెంట్
  • ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచన
గర్ల్ ఫ్రెండ్ ను సరదాగా బైక్ పై తిప్పుతూ బెంగళూరులో ఓ యువకుడు సాగించిన షికారు బెడిసికొట్టింది. హెల్మెట్ లేకుండా వాహనం నడపడమే కాకుండా ఆమెను పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకొని ప్రమాదకర రీతిలో బైక్ నడపడం అతనికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు అతని ఆటకట్టించారు. యువకుడిని అరెస్టు చేయడంతోపాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 17న రాత్రి బెంగళూరులోని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ రోడ్డు మార్గంలో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ నడిపాడు. అతని వెనకాలే కారులో వస్తున్న ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లంతా యువకుడి చర్యను తప్పుబట్టారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు.

దీనిపై స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా యువకుడిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమ ‘ఎక్స్’ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.

‘థ్రిల్ కోరుకొనే వ్యక్తులారా.. రోడ్డు ఉన్నది స్టంట్లు చేసేందుకు కాదు. మీతోపాటు ప్రయాణించే ప్రతి ఒక్కరి కోసం రోడ్డును భద్రంగా ఉంచండి. అందరం బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుదాం’ అని కామెంట్ పోస్ట్ చేశారు. బెంగళూరు నగరం జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికే ఉందని.. ఇది గందరగోళం సృష్టించాలనుకొనే ప్రాంతం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు బైక్ పై ప్రమాదకరంగా కూర్చున్న యువతిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ చట్టం కేవలం అబ్బాయిలనే శిక్షిస్తోందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Bengaluru
Biker rider
Stunt
Traffic Police
Arrest

More Telugu News