zomato: గర్భిణికి వెజ్ కు బదులు నాజ్ వెజ్ డెలివరీ.. జొమాటోపై భర్త ఆగ్రహం

Pregnant Woman On Vegetarian Diet Receives Chicken Thali Zomato Reacts
  • ఆ సంస్థ తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్
  • స్పందించిన జొమాటో.. ఉత్తమ పరిష్కారం అందించినట్లు వెల్లడి
  • ఆ వ్యక్తి వైఖరిపై మండిపడ్డ నెటిజన్లు
  • పొరపాటు రెస్టారెంట్ చేస్తే జొమాటోను తప్పుబట్టడం సరికాదని కామెంట్లు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వంట చేసుకొనే తీరిక లేని వారికి ఫుడ్ డెలివరీ యాప్ లు చక్కటి పరిష్కారం అందిస్తున్నాయి. అయితే ఫుడ్ ఆర్డర్లు పెరిగేకొద్దీ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. డెలివరీలో జాప్యం, ఆర్డర్ చేసిన ఐటెమ్ లలో కొన్ని రాకపోవడం లేదా ఒక ఆర్డర్ కు బదులు మరో ఆర్డర్ రావడం వంటివి జరగడం కామన్ గా మారిపోయాయి.

బెంగళూరులో ఓ గర్భిణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. శాకాహారి అయిన ఆమె జొమాటోలో పన్నీర్ థాలీ కోసం ఆర్డర్ పెట్టగా ఆర్డర్ తెచ్చిన వ్యక్తి పొరపాటున చికెన్ థాలీ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనిపై ఆమె భర్త ‘ఎక్స్’ వేదికగా జొమాటో తీరును తప్పుబట్టాడు.

ఇలా ఎందుకు జరిగిందో చెప్పాలంటూ జొమాటోను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. శాకాహారులు మాంసాహారం ఎలా తినగలరని ప్రశ్నించాడు. అందులోనూ ఒక గర్భిణి ఎలా తినగలదని.. ఒకవేళ ఆమెకు ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని నిలదీశాడు.

దీనిపై జొమాటో స్పందించింది. ఫోన్లో సంప్రదించడం ద్వారా ఇందుకుగాను తమ వైపు నుంచి ఉత్తమ పరిష్కారాన్ని కస్టమర్ కు అందించినట్లు తెలిపింది. 

అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రెస్టారెంట్ నిర్వాహకులు పొరపాటు చేస్తే దానికి జొమాటో యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
zomato
panneer thali
chicken thali
onine order
Social Media
post
viral

More Telugu News