Canada: ఆ దేశంలో అంత్యక్రియల ఖర్చు రూ. 30 లక్షలు.. వల్లకాక వదిలేస్తున్న కుటుంబాలు!

Families in Canada unable to perform last rites of their loved ones
  • కెనడాలో దారుణ పరిస్థితులు
  • ఏటేటా పెరుగుతున్న అనాథ శవాల సంఖ్య
  • తడిసిమోపెడవుతున్న అంత్యక్రియల ఖర్చులు 
  • అంత్యక్రియలకూ నోచుకోలేకపోతున్న అయినవారు
కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించలేక అనాథ శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణం. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది.

దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. 

కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది. గ్రేటర్ టొరొంటోలో అయితే ఇది 34 వేల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూ. 27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే. ఇతర ఖర్చులు కూడా కలుపుకొంటే రూ. 30 లక్షలు దాటేస్తోంది. ఇంతింత ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలిపెట్టేస్తున్నాయి.
Canada
Last Rites
Funeral Costs
Dead Bodies
Toronto
Graveyard

More Telugu News