KA Paul: ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు.. కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

Cheating Case Filed Against KA Paul In Punjagutta
  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పాల్‌పై ఎఫ్ఐఆర్
  • ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని పాల్ మోసం చేశారంటూ బాధితుడు కిరణ్‌కుమార్ ఫిర్యాదు
  • రూ.50 లక్షల్లో రూ. 30 లక్షలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేశానన్న కిరణ్‌కుమార్
  • విశాఖలోనూ పాల్‌పై కేసు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాల్ తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. రూ. 30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించగా, మిగతా రూ. 20 లక్షలు పలు దఫాలుగా పాల్‌కు నేరుగా చెల్లించినట్టు తెలిపారు.

డబ్బులు తీసుకున్నప్పటికీ తనకు టికెట్ మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్ విశాఖ నుంచి ఎంపీగా, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. విశాఖలో పోలైన 14 లక్షల ఓట్లలో దాదాపు 9 లక్షలు తనకే వస్తాయని ప్రచారం చేసుకున్న పాల్‌పై అక్కడ కూడా కేసు నమోదైంది.
KA Paul
Punjagutta
Praja Shanthi Party
Hyderabad

More Telugu News