Royal Challengers Bengaluru: సంచలన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ

Royal Challengers Bengaluru script historic sixes record in T20 cricket and go past Sunrisers Hyderaba
  • ఈ సీజన్‌లో ఇప్పటివరకు 157 సిక్సర్లు బాదిన ఆర్సీబీ
  • ఒక టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా అవతరణ
  • 146 సిక్సర్లతో ఉన్న సన్‌రైజర్స్ రికార్డు బ్రేక్ చేసిన బెంగళూరు
ఐపీఎల్ 2024లో శనివారం రాత్రి సంచలనం నమోదయింది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్టేనని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలన రీతిలో చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా 6వ విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై 191 పరుగులకే పరిమితమైంది. దీంతో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ చారిత్రాత్మక విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పలు రికార్డులను బద్దలుకొట్టింది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 16 సిక్సర్లు, 14 ఫోర్లు బాదారు. తొమ్మిదవ సిక్సర్‌తో ఈ సీజన్‌లో ఆర్సీబీ సిక్సర్ల సంఖ్య 150కి చేరుకుంది. దీంతో ఒక టీ20 టోర్నమెంట్‌ సీజన్‌లో 150 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ప్రపంచంలోనే ఈ మైలురాయిని సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. దీంతో ఈ సీజన్‌లో 146 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డు బద్దలైంది.

టీ20 టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు..
1. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -157
2. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ -146
3. ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ - 145
4. టీ20 బ్లాస్ట్ 2023లో సర్రే టీమ్ - 144
5. ఐపీఎల్ 2019లో కోల్‌కతా నైట్ రైడర్స్ - 143

కోహ్లీ రికార్డు
మరోవైపు చెన్నై మ్యాచ్‌లో 29 బంతుల్లో 54 పరుగులు బాదిన విరాట్ కోహ్లీ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 37 సిక్సర్లు బాదాడు. 36 సిక్సర్లతో నికోలస్ పూరన్ రెండో స్థానంలో, 35 సిక్సర్లతో అభిషేక్ శర్మ మూడో స్థానంలో, 32 సిక్సర్లతో సునీల్ నరైన్ నాలుగో స్థానంలో, 31 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ 5వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ పరుగులు 700 మైలురాయిని దాటాయి.
Royal Challengers Bengaluru
Sunrisers Hyderabad
IPL 2024
Cricket
CSK vs RCB

More Telugu News