No Confidence Motion: కాంగ్రెస్‌లో చేరిన ఎల్లారెడ్డి చైర్మన్‌కు షాక్... అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్

No confidence motion won by brs on Yellareddy chairman
  • చైర్మన్ సత్యంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
  • గత నెల 24న కలెక్టర్‌కు తీర్మాన పత్రం అందజేత
  • ఈరోజు ఆర్డీవో ఆధ్వర్యంలో సమావేశమైన మున్సిపల్ సభ్యులు
  • 12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు
  • చైర్మన్ పదవిని కోల్పోయిన కుడుముల సత్యం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సత్యం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన పత్రాన్ని గత నెల 24వ తేదీన కలెక్టర్‌కు అందించారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. అవిశ్వాసం నెగ్గడంతో సత్యం పదవిని కోల్పోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 14వ తేదీన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
No Confidence Motion
Kamareddy District
BRS
Congress

More Telugu News