Karthik Aryan: హోర్డింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు

Bollywood star Karthik Aryan relatives dead in Mumbai hording collapse incident
  • ముంబైలో ఇటీవల కూలిపోయిన భారీ హోర్డింగ్
  • ఈ ప్రమాదంలో 16 మంది మృతి
  • హీరో కార్తీక్ ఆర్యన్ బంధువుల కన్నుమూత
బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. ముంబైలో అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా ఇటీవల ఒక భారీ హోర్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఒక పెట్రోల్ బంక్ పై పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కార్తీక్ ఆర్యన్ బంధువులు కూడా ఉన్నారు. కార్తీక్ ఆంటీ అనిత (59), అంకుల్ (60) ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలకు కార్తీక్ హాజరయ్యారు. తన ఆంటీ, అంకుల్ కు నివాళి అర్పించారు. అంత్యక్రియలకు కార్తీక్ హాజరు కావడంతో ఆయన బంధువులు చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది.
Karthik Aryan
Bollywood

More Telugu News