Revanth Reddy: ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు

CM Revanth Reddy instructions to high revenue
  • పన్ను ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచన
  • నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని రాబడులు సాధించాలన్న సీఎం
  • జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి
  • మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగడం లేదని వ్యాఖ్య

పన్నుల ఎగవేత పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది ఆదాయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నెలవారీ లక్ష్యాలు పెట్టుకొని రాబడులు సాధించాలన్నారు.

పన్నుల ఎగవేత పట్ల అధికారులకు సూచనలు జారీ చేశారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దన్నారు. జీఎస్టీ రిటర్న్స్‌లో అక్రమాలు జరగడానికి వీల్లేదన్నారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగడం లేదన్నారు. అక్రమ మద్యం, పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News