Uppal: ఉప్పల్ ను కమ్మేసిన దట్టమైన మేఘాలు... ఆందోళనలో సన్ రైజర్స్ అభిమానులు

Rain alert for Uppal as ground staff covered pitch
  • హైదరాబాదులో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
  • ఉప్పల్ స్టేడియంలో పిచ్ ను కవర్లతో కప్పేసిన సిబ్బంది
  • రాత్రి 7 గంటలకు సన్ రైజర్స్, గుజరాత్ మ్యాచ్
హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షం కుమ్మేసింది. ఉప్పల్ ప్రాంతంలోనూ దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు సన్ రైజర్స్ కు ఎంతో అవసరం. 

అయితే, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉండడంతో సన్ రైజర్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు, ముందుజాగ్రత్తగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ ను గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్ లో కూడా చాలా భాగం కవర్లతో కప్పివేశారు.
Uppal
Rain Alert
SRH
GT
Hyderabad
IPL 2024

More Telugu News