Pulivarthi Nani: చంద్రగిరి ఎన్నికల అధికారి వ్యంగ్యంగా నవ్వారు: పులివర్తి నాని

Pulivarthi Nani demands to change Chandragiri election officer
  • చంద్రగిరి ఎన్నికల ఇన్ఛార్జ్ నిషాంత్ రెడ్డిని మార్చేయాలన్న పులివర్తి నాని
  • ఆయనను మార్చకపోతే కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతాయని ఆందోళన
  • స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారని వెల్లడి
చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ నిషాంత్ రెడ్డిని తక్షణమే మార్చేయాలని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని డిమాండ్ చేశారు. ఆయనను మార్చకపోతే కౌంటింగ్ లో అక్రమాలు జరుగుతాయని చెప్పారు. తిరుపతిలో ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారని తెలిపారు. 

తమను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మాత్రం బయట తిరుగుతున్నారని పులివర్తి నాని మండిపడ్డారు. ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిపై చీఫ్ సెక్రటరీ, డీజీపీతో ఈసీ జరుపుతున్న మీటింగ్ లో చర్చ జరగాలని అన్నారు. తిరుపతి స్ట్రాంగ్ రూమ్ వెనుక చెవిరెడ్డి సొంత ఊరు తుమ్మలగుంటకు వెళ్లే దారి ఉందని... ఆ దారి గుండా దుండగులు అక్రమంగా లోపలకు చొరబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిషాంత్ రెడ్డికి చెపితే... వ్యంగ్యంగా నవ్వారని చెప్పారు.
Pulivarthi Nani
Telugudesam
Chevireddy Bhaskar Reddy
YSRCP

More Telugu News