Sai Varshith Kandula: వైట్‌హౌస్‌పై దాడి.. నేరం అంగీక‌రించిన తెలుగు కుర్రాడు!

Sai Varshith Kandula Indian origin Nazi sympathiser who crashed rented truck into White House perimeter
  • గ‌తేడాది అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్‌పై దాడికి య‌త్నించిన సాయి వ‌ర్షిత్ కందుల
  • గత ఏడాది మే 22న ఒక ట్ర‌క్కుతో స‌రాస‌రి శ్వేత‌సౌధంలోకి దూసుకెళ్లేందుకు య‌త్నం 
  • నాజీల స్ఫూర్తితో అగ్ర‌రాజ్యంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ఇలా చేశానంటూ కోర్టులో అంగీక‌రించిన తెలుగు కుర్రాడు
హైద‌రాబాద్‌కు చెందిన సాయి వ‌ర్షిత్ కందుల (20) గ‌తేడాది అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్‌హౌస్‌పై దాడికి య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కోర్టులో త‌న నేరాన్ని అత‌డు అంగీక‌రించాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో నివాసం ఉండే అతడు గత ఏడాది మే 22న వాషింగ్ట‌న్ డీసీ చేరుకున్నాడు. ఆ త‌ర్వాత‌ ఒక ట్ర‌క్కుని అద్దెకు తీసుకుని స‌రాస‌రి శ్వేత‌సౌధంలోకి దూసుకెళ్లేందుకు య‌త్నించి సెక్యూరిటీ అధికారుల‌కు దొరికిపోయాడు. జ‌ర్మ‌నీకి చెందిన‌ నాజీల స్ఫూర్తితో అగ్ర‌రాజ్యంలో అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నే ఇలా చేశానంటూ వ‌ర్షిత్ పోలీసుల వ‌ద్ద చెప్పాడు. 

కాగా, వ‌ర్జీనియాలోని డల్లెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కందుల వ‌ర్షిత్ ట్రక్కును అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. సంఘ‌ట‌న రోజు రాత్రి 9:35 గంటలకు శ్వేత‌సౌధానికి వెళ్లాడు. ఆ త‌ర్వాత ట్ర‌క్కు న‌డుపుతూ భ‌ద్ర‌తా సిబ్బందిని దాటుకుని లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, ఉన్న‌ట్టుండి ట్ర‌క్కు ఆగిపోవ‌డంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోయాడు. ఆ స‌మ‌యంలో అత‌డు నాజీ స్వస్తిక్ జెండాను కూడా ప్రదర్శించాడు. దాంతో యూఎస్‌ పార్క్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఘటనా స్థలంలో వ‌ర్షిత్‌ను అరెస్టు చేశారు.

అమెరికా న్యాయవాది మాథ్యూ గ్రేవ్స్ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని జ‌ర్మ‌నీ నాజీ భావజాలమైన‌ నియంతృత్వంతో భర్తీ చేయడం వ‌ర్షిత్‌ ఉద్దేశమ‌ని పేర్కొన్నారు. అతను తన లక్ష్యాలను సాధించడానికి అధ్యక్షుడు సహా యూఎస్ కీల‌క‌ అధికారులను హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇక ఈ దాడి వలన భారీ ఆర్థిక నష్టం జరిగింది. యూ-హౌల్ ఇంటర్నేషనల్‌కు 50వేల డాల‌ర్లు, మరమ్మతుల‌ కోసం నేషనల్ పార్క్ సర్వీస్‌కు 4,322 డాల‌ర్ల ఖర్చు అయింది. వ‌ర్షిత్‌ తన పన్నాగాన్ని అమ‌లు చేయ‌డానికి వారాల తరబడి దాడికి ప్లాన్‌ చేశాడని న్యాయ శాఖ పేర్కొంది. కాగా, వ‌ర్షిత్ కందుల‌కు ఆగ‌స్టు 23వ తేదీన యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి డాబ్నీ ఎల్‌. ఫ్రెడరిచ్ శిక్షను ఖ‌రారు చేయ‌నున్నారు.
Sai Varshith Kandula
White House
USA
Indian origin

More Telugu News