కేఎల్ రాహుల్‌కు ఒక్క హగ్ ఇచ్చి వ్యతిరేకతను పోగొట్టుకున్న సంజీవ్ గోయెంకా
- హైదరాబాద్‌పై ఓటమి తర్వాత రాహుల్‌పై స్టేడియంలోనే అరిచేసిన సంజీవ్ గోయెంకా
- ఇప్పుడు డిన్నర్‌కు పిలిచి హగ్ ఇచ్చిన ఫ్రాంచైజీ యజమాని
- వీరికి మించిన నటులు ఎవరూ లేరంటున్న నెటిజన్లు
రాహుల్‌ను ఢిల్లీలోని తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించిన గోయెంకా అతడు వచ్చిన వెంటనే ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోయాయని అభిమానులు చెప్తున్నారు. ఒక్క ఆలింగనంతో తనపై వచ్చిన వ్యతిరేకతను గోయెంకా పోగొట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొందరు మాత్రం మన నటులకంటే వీరే బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. లక్నో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉంది. అధికారికంగా ఎలిమినేట్ కానప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టుకు మృగ్యమే.