Constable Suicide: శ్రీశైలంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Police constable suicide in Srisailam
  • శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ శంకర్
  • పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో బలవన్మరణం
  • విచారణ జరుపుతున్న సీఐ ప్రసాద్ రావు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేనుకున్నారు. మృతుడు శంకర్ శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ప్రసాద్ రావు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ... శ్రీశైలంకు వెళ్తున్నానని, అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. శంకర్ సూసైడ్ తో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News