RR vs PBKS: పంజాబ్‌, రాజ‌స్థాన్ మ‌ధ్య‌ నామ‌మాత్ర‌పు మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న శాంస‌న్‌

Sanju Samson wins the toss and opts to bat
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తుల‌ కోసం నువ్వా? నేనా? అన్న‌ట్లు సాగుతున్న ఐపీఎల్ పోరులో ఈ మ్యాచ్ నామ‌మాత్రం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరింది. మ‌రోవైపు ఈ సీజ‌న్‌లో ఘోరమైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా ఇప్ప‌టికే పీబీకేఎస్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్‌-2లో నిల‌వాల‌ని రాజ‌స్థాన్ భావిస్తుంటే.. టాప్ జ‌ట్టు ఆర్ఆర్‌ను మ‌ట్టిక‌రిపించి అభిమానుల‌కు అస‌లైన మ‌జా ఇవ్వాల‌ని పంజాబ్ చూస్తోంది. 

రాజ‌స్థాన్ జ‌ట్టు: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, ఆర్‌ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.

పంజాబ్ జ‌ట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీప‌ర్‌), రిలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, సామ్ కర్రాన్ (కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
Go Back to Shorts
RR vs PBKS
Sanju Samson
IPL 2024
Rajasthan Royals
Punjab Kings
Cricket
Sports News

More Telugu News