JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్ లో చికిత్స

JC Prabhakar Reddy in Hyderabad KIMS hospital
  • ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైన జేసీ
  • హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత
  • వైద్య పరీక్షల తర్వాత బులెటిన్ విడుదల చేస్తామన్న డాక్టర్లు
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీని ప్రభావంతో జేసీ అస్వస్థతకు గురయ్యారు. బాష్పవాయువు కారణంగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. 

ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఎవరూ రావద్దని కార్యకర్తలను ఆయన కోరారు. మరోవైపు, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కిమ్స్ డాక్టర్లు తెలిపారు.
JC Prabhakar Reddy
Telugudesam
Ill

More Telugu News