Bandi Sanjay: కరీంనగర్ వీధుల్లో కుటుంబ సభ్యులతో స్కూటీపై బండి సంజయ్ చక్కర్లు... ఇదిగో ఫొటోలు

Bandi Sanjay spending with family after a marathon campaign
  • నిన్నటి వరకు క్షణం తీరికలేని రాజకీయ నాయకులు
  • పోలింగ్ ముగియడంతో నేడు రిలీఫ్ అయిన ఆయా పార్టీల అభ్యర్థులు
  • కుటుంబ సభ్యులతో బేకరీకి వెళ్లి ఐస్ క్రీమ్, సమోసా తిన్న బండి సంజయ్

నిన్నటి వరకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి. నాయకులు... ముఖ్యంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంతో బిజీగా గడిపారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా నిన్నటి వరకు క్షణం తీరికలేకుండా ప్రచారంలో... కార్యకర్తల సమావేశాల్లో... బహిరంగ సభల్లో పాల్గొంటూ గడిపారు. నిన్న పోలింగ్ ముగియడంతో నాయకులు రిలీఫ్ అయ్యారు.

బండి సంజయ్ కూడా నిన్న పోలింగ్ ముగియడంతో ఈరోజు తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. స్కూటీపై సరదాగా కరీంనగర్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. బేకరీకి వెళ్లి ఐస్ క్రీమ్, సమోసా తిన్నారు. ఆ తర్వాత స్కూటీ పైనే తిరిగి ఇంటికి వచ్చారు. బండి సంజయ్ కరీంనగర్ వీధుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న వైనాన్ని చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.
             

  • Loading...

More Telugu News