రాజమండ్రిలో అతి పురాతన గ్రంథాలయాన్ని సందర్శించిన పురందేశ్వరి
- నిన్నటి వరకు బిజీగా గడిపిన పురందేశ్వరి
- ఇవాళ ఆటవిడుపుగా ప్రఖ్యాత గౌతమి గ్రంథాలయ సందర్శన
- నన్నయ వాడిన ఘంటాన్ని అత్యంత ఆసక్తిగా పరిశీలించిన వైనం
ఇది అతి పురాతన గ్రంథాలయం. ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న అనేక ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, తెలుగు చరిత్రను వెలుగులోకి తెచ్చిన బ్రిటీష్ అధికారి మెకెంజీ రాతలను పరిశీలించారు. ఇక, ఆదికవి నన్నయ్య రాసేందుకు స్వయంగా ఉపయోగించిన ఘంటాన్ని పురందేశ్వరి అత్యంత ఆసక్తితో తిలకించారు.
