YS Jagan: నాకు ఆశీస్సులు అందించడానికి సునామీలా తరలి వచ్చారు: సీఎం జగన్

CM Jagan thanked everyone who vote for YSRCP
  • ఏపీలో నిన్న ఎన్నికలు
  • మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చారన్న సీఎం జగన్
  • మరింత మెరుగైన పాలన అందిస్తామంటూ హామీ
ఏపీలో నిన్నటి పోలింగ్ పై సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా తనకు ఆశీస్సులు అందించేందుకు సునామీలా తరలి వచ్చారని పేర్కొన్నారు. 

"ఈ సందర్భంగా నా అవ్వాతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వైసీపీ కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
YS Jagan
YSRCP
Voters
AP Elections

More Telugu News