Naga Shourya: 'ఛలో' సినిమా హిట్ .. కానీ మాకు డబ్బులు రాలేదే: నాగశౌర్య తల్లి ఉష

Usha Mulpuri Interview
  • నాగశౌర్య కష్టపడి ఎదిగాడన్న ఉష 
  • 'ఛలో' సినిమా కోసం ఒక మెట్టు దిగాడని వ్యాఖ్య
  • డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వలేదని వెల్లడి 
  • ఇండస్ట్రీలో ఇలా ఉంటుందని వివరణ    

నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే నాగశౌర్య హీరోగా సొంత బ్యానర్లో ఆమె కొన్ని సినిమాలు చేశారు. ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉష మాట్లాడుతూ .. "చిన్నప్పుడు నాగశౌర్య పెద్దగా చదువుకునేవాడు కాదు. అందువలన నేను కొట్టేదానిని. నాగశౌర్య హీరోగా ట్రై చేస్తానని అంటే నేను వద్దనే అన్నాను. కానీ ఆ తరువాత సరే అనాల్సి వచ్చింది" అని అన్నారు. 

" ఇక నాగశౌర్య హీరోగా తనంతట తానుగా కష్టపడుతూ అవకాశాలు తెచ్చుకున్నాడు. అందులో మా ప్రమేయమేమీ లేదు. ఏ రోజున కూడా మేము నిర్మాతలుగా మారాలని అనుకోలేదు. కొన్ని కారణాల వలన అలా మారవలసి వచ్చింది. నాగశౌర్య 'ఛలో' సినిమా చేయాలనుకున్నాడు. నిర్మాత కోసం వెదుకుతున్నారు. తనకి పారితోషికం ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి ఒక నిర్మాతను ఒప్పించడానికి నాగశౌర్య ప్రయత్నించాడు. 

ఆ విషయాన్ని నాగశౌర్య నాకు చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. అవసరం లేదు ఆ సినిమా మనమే చేద్దామని చెప్పాను. అప్పటికి సినిమా బిజినెస్ గురించి మాకు ఏమీ తెలియదు. ఆ సినిమాను చేశాము .. పెద్ద హిట్ అయింది .. అయినా మాకు డబ్బులు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. అదే 'నర్తనశాల' సినిమా పోగానే ఉదయాన్నే వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. అలా ఉంటుంది ఇక్కడ" అని అన్నారు.

  • Loading...

More Telugu News