IPL 2024: మ్యాచ్ బాల్‌ను దొంగిలించాల‌ని చూసిన అభిమాని.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Police Recovers Match Ball from Fan Who Tried to Steal it During KKR vs MI IPL 2024 Clash
  • ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కేకేఆర్, ఎంఐ మ్యాచ్‌లో ఘ‌ట‌న‌
  • త‌న చేతికి అందిన బాల్‌ను ప్యాంట్‌లో వేసుకున్న అభిమాని
  • పోలీసులు వ‌చ్చి బాల్‌ను రిక‌వ‌రీ చేసుకున్న వైనం

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఆదివారం జ‌రిగిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న తాలూకు వీడియో తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ అభిమాని మ్యాచ్ బాల్‌ను దొంగిలించాల‌ని చూడ‌టం వీడియోలో ఉంది. త‌న చేతికి అందిన బాల్‌ను ఆ ఫ్యాన్ ఏకంగా త‌న ప్యాంట్‌లో వేసుకున్నాడు. తోటి ప్రేక్ష‌కులు ఎంత చెప్పినా.. అత‌డు తిరిగి బాల్ ఇవ్వ‌లేదు. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన పోలీసులు అత‌ని వ‌ద్ద నుంచి బాల్ తీసుకున్నారు. అనంత‌రం అభిమానిపై పోలీసులు చేయి చేసుకోవ‌డం వీడియోలో ఉంది. 

ఇక వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అలాగే 16 ఓవ‌ర్ల‌కు కుదించిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో ఈ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించిన తొలి జ‌ట్టుగా కోల్‌క‌తా నిలిచింది. నిన్న‌టి గుజ‌రాత్ టైటాన్స్ తో మ్యాచ్ కూడా వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు కావ‌డంతో కేకేఆర్ ఖాతాలో మ‌రో పాయింట్ చేరింది. దీంతో ప్ర‌స్తుతం 13 మ్యాచుల్లో (9 విజ‌యాలు) 19 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News