Anil Kumar Yadav: పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు: అనిల్‌ కుమార్‌ యాదవ్

Palnadu SP not responded to our calls says Anil Kumar Yadav
  • మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారన్న అనిల్
  • కొందరు పోలీసులు టీడీపీ అనుచరుల్లా వ్యవహరించారని మండిపాటు
  • తనను హౌస్ అరెస్ట్ చేశారన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని... పిన్నెల్లి, ఆయన కుమారుడిపై దాడి చేశారని అన్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని తెలిపారు. 

తాము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని... కొందరు పోలీసులు టీడీపీ అనుచరుల్లా వ్యవహరించారని అన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. 

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కొందరు పోలీసులు తమకు వ్యతిరేకంగా పని చేశారని విమర్శించారు. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని... ఈ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News