Naga Babu: నాగ‌బాబు ట్వీట్ ఎవ‌రి కోసం..?

Naga Babu Interesting Tweet goes Viral on Social Media
  • జ‌న‌సేన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్
  • మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడేన‌న్న మెగా బ్ర‌ద‌ర్‌
  • మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్‌

మెగా బ్ర‌ద‌ర్‌, జ‌న‌సేన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే' అని రాసుకొచ్చారు. దీనిపై ఇప్పుడు ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల మెగా హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ర‌విచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ మ‌ద్ద‌తిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో బ‌న్నీని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

  • Loading...

More Telugu News