Nadendla Manohar: తెనాలి ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ ను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

Nadendla Manohar visits Gotimmukkla Sudhakar in Guntur GGH
  • తెనాలిలో ఓ పోలింగ్ బూత్ లో ఘర్షణ
  • ఓ ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే అన్నాబత్తుని
  • తిరిగి ఎమ్మెల్యేను కొట్టిన ఓటరు
  • ఓటరుపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు
  • గుంటూరు జీజీహెచ్ లో ఓటరు సుధాకర్ కు చికిత్స
ఇవాళ పోలింగ్ సందర్భంగా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంపదెబ్బ కొట్టగా, సుధాకర్ కూడా తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఆ తర్వాత తనపై ఏడెనిమిది మంది కలిసి దాడి చేశారని, కిందపడేసి కాళ్లతో తన్నారని సుధాకర్ ఆరోపించారు. 

కాగా, దాడిలో గాయపడి ఆసుపత్రిపాలైన ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ను తెనాలి జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ వద్దకు వెళ్లి మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Nadendla Manohar
Gottimukkala Sudhakar
Annabathuni SIvakumar
Janasena
YSRCP
Tenali

More Telugu News