Vanga Geetha: పిఠాపురంలో ఎర్ర కండువా వేసుకుని బూత్ వద్దకు వచ్చిన వ్యక్తి... తీవ్ర అభ్యంతరం చెప్పిన వంగా గీత

Vanga Geetha objects a man wearing red towel
  • పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కల్యాణ్ × వంగా గీత
  • ఓ పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన వంగా గీత
  • ఎర్ర కండువా వేసుకొచ్చిన వ్యక్తిని అక్కడ్నించి వెళ్లిపోవాలని హుకుం 

ఏపీలో ఇవాళ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. 

కాగా, ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతడు మెడలో ఎర్ర కండువా వేసుకుని రావడమే అందుకు కారణం. అయితే, అతడు జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. 

అయితే, ఇది గుడ్డ అంటూ ఆ వ్యక్తి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వంగా గీతతో పాటు, అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతడిని అక్కడ్నించి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News