Jio OTT Plan: ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో తాజా ఓటీటీ ప్లాన్!

Jio launches new unlimited OTT plan for Fiber users offering free Netflix Prime Video and more
  • రూ.889కే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా 15 ఓటీటీ సర్వీసులు అందుబాటులోకి
  • అన్‌లిమిటెడ్ స్ట్రీమింగ్ పేరిట 30 ఎంబీపీఎస్ స్పీడుతో ప్లాన్
  • పాత కస్టమర్లు కూడా కొత్త ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే ఛాన్స్

ఓటీటీ కంటెంట్‌కు ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో మరో కొత్త ఓటీటీ ప్లాన్ తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా అనేక ఓటీటీ యాప్‌లను అందించేలా రూ.899కే కొత్త ప్లాన్ ప్రారంభించింది. అన్‌లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాన్ పేరుతో తెచ్చిన ఈ ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ స్టీడుతో ఎటువంటి ఆటంకాలు లేకుండా స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది. 

ఈ ప్లాన్‌లో నెటిఫ్లిక్స్ (బేసిక్), ప్రైమ్ వీడియో (లైట్), జియో సినిమా ప్రీమియంతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ, జీ5, సన్ నెక్ట్స్‌, డిస్కవరీ ప్లన్, ఈరోస్ నౌవ్ వంటి 15 నిషే ఓటీటీ సర్వీసులు కూడా ఉన్నాయి. 10 ఎంబీపీఎస్, 30 ఎంపీబీఎస్ ప్లాన్ వినియోగదారులు కూడా ఈ ఓటీటీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని జియో తెలిపింది. 

ఇక జియో ఇటీవల ప్రకటించిన ఐపీఎల్ ధన్‌ ధనా దన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్ వినియోగదారులకు వర్తిస్తుంది. అర్హులైన వినియోగదారులు 50 డే డిస్కౌంట్ క్రెడిట్‌ను పొందవచ్చు. 

కాగా, ఓటీటీ వినియోగదారుల కోసం జియో ఇటీవలే యాడ్ రహిత జియో సినిమా ప్రీమియం ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. రూ.29ల ప్లాన్‌తో పాటు రూ.89ల ఫ్యామిలీ ప్లాన్ కూడా తెచ్చింది. రూ.29 ప్లాన్‌తో వినియోగదారులు 4కే కంటెంట్, యాడ్ ఫ్రీ వ్యూవింగ్, ఆఫ్‌లైన్‌లో చూసుకునేందుకు డౌన్‌లోడ్ ఆప్షన్ తదితర సదుపాయాలు ఈ ప్లాన్‌లో ఉన్నాయి. రూ.89ల ప్లాన్‌తో వినియోగదారులు నాలుగు డివైజుల్లో ఒకేసారి కంటెంట్ వీక్షించే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్ తెచ్చింది.

  • Loading...

More Telugu News