Varla Ramaiah: ఓటరు మహాశయులారా... ఇలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త!: వర్ల రామయ్య

  • ఏపీలో రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్
  • ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న వర్ల రామయ్య
  • దుర్మార్గాన్ని తరిమికొట్టేందుకు తమ వంతుగా ఓటేయాలని పిలుపు
  • పోలింగ్ కేంద్రం బయటే ఇంకు పూసే ప్రమాదం ఉందన్న టీడీపీ నేత
Varla Ramaiah talks about voting procedures

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని దుర్మార్గాన్ని తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్ లో భాగస్వామ్యం కావాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ ఓటర్ల చేతుల్లో ఉందని అన్నారు. ఎండకు, వానకు భయపడకుండా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలు హైదరాబాద్, బెంగుళూరులాంటి సిటీల్లో 40% పోలింగ్ మాత్రమే నమోదైందని, మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పట్టణ, పల్లె ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని రాష్ట్ర ఉన్నతికి సహకరించాలని వర్ల రామయ్య కోరారు. 

90 శాతం పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 

ఇంకు పూసినా, ఇంకేది చేసినా ఓటు హక్కును హరించలేరు

కొంత మంది దుర్మార్గపు ఆలోచనలు, దొంగ ఫోటోలతో మోసం చేస్తారు... మోసపోకండి. ఓటును హక్కుగా భావించండి. మీ హక్కును ఓటుగా బూత్ లో వేయండి. మిమ్మల్ని ఓటు వేయనివ్వకుండా ఇళ్ల వద్దనే ఇంకు పూసినా... ఇంకేది చేసినా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. 

వీళ్లు దొంగ ఇంకు పూసినంత మాత్రాన మీ ఓటు హక్కు హరించలేరు. మీరు వెళ్లేటప్పటికే మీ ఓటును ఎవరైనా వేస్తే ఛాలెంజ్ ఓటు అడిగి తీసుకుని మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అప్పటికే మీ ఓటును ఎవరైనా వేశారని అధికారి చెబితే మీరు టెండర్ ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

మీ ఓటును దుర్మార్గుల చేతికి వెళ్లనివ్వకండి

ఓటు వేయకుండా అపవిత్రం చేయకండి... దుర్మార్గుల చేతికి మీ ఓటును వెళ్లనివ్వకండి. ఎన్నికల కమిషన్ ఓటర్లకు మౌళిక సదుపాయాలు కల్పించాలి. అవసరమైన వారికి సహాయకులను ఏర్పాటు చేయాలి. వర్షం పడితే ఒటర్లు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి. ఓటు వేసేటప్పుడు పోలింగ్ అధికారుల సహాయం తీసుకునే ముందు తగు జాగ్రత్తలు ఓటర్లు తీసుకోవాలి.

దళితుడిపై దాడి చేసిన కోన వెంకట్ ను అరెస్ట్ చేయాలి

నేడు అంతర్జాతీయ తల్లుల దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఓ తల్లి ఆక్రందన, ఆవేదన, ఆత్మఘోష రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బాపట్లలో దళితుడ్ని కొట్టిన కోన వెంకట్, ఎస్సై జనార్దన్ లను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలి. దుర్మార్గాన్ని అరికట్టాలి. పోలింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News